ఈ అన్నం ఎలా తినాలి సార్..? | how to eat sir rice...!!! | Sakshi
Sakshi News home page

ఈ అన్నం ఎలా తినాలి సార్..?

Dec 16 2014 3:02 AM | Updated on Nov 9 2018 4:46 PM

ఈ అన్నం ఎలా తినాలి సార్..? - Sakshi

ఈ అన్నం ఎలా తినాలి సార్..?

భోజన పదార్థాలు సరిగ్గా వండడం లేదని, అడ్డ పేర్లతో పిలుస్తూ చేయిచేసుకుంటున్నారని స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట పట్టణంలోని ఎస్టీ సంక్షేమ వసతి గృహ విద్యార్థులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.

భోజనం ప్లేట్లతో ఎస్టీ హాస్టల్ విద్యార్థుల నిరసన
పెనుకొండ: భోజన పదార్థాలు సరిగ్గా వండడం లేదని, అడ్డ పేర్లతో పిలుస్తూ చేయిచేసుకుంటున్నారని స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట పట్టణంలోని ఎస్టీ సంక్షేమ వసతి గృహ విద్యార్థులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.  విద్యార్థులు భోజనం ఉన్న ప్లేట్లను వెంట తీసుకొని వచ్చి అధికారులకు చూపుతూ హాస్టల్ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు.  ఉడికీఉడకని అన్నం పెడ్తున్నారని, భోజనం నాణ్యంగా లేదని ఆరోపించారు.

అడ్డ పేర్లతో తమను అవమానపరుస్తున్నారని, తాము హాస్టల్‌లో ఉండలేకపోతున్నామన్నారు. అనంత రం ఏఓ అబ్దుల్ హమీద్‌కు వినతి పత్రం అందజేశారు. ఏఓ స్పందిస్తూ వసతి గృహానికి వెళ్లి విచారించాల్సిందిగా తమ సిబ్బందిని పంపారు. కార్యక్రమం లో సీఐటీయు  నాయకులు  రమేష్, చిరంజీవి, విద్యార్థులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement