టెన్త్ కొత్త సిలబస్‌పై 14న అవగాహన | Hopefully 14 percent on the new understanding of the | Sakshi
Sakshi News home page

టెన్త్ కొత్త సిలబస్‌పై 14న అవగాహన

Apr 10 2014 1:42 AM | Updated on Sep 2 2017 5:48 AM

డాక్టర్ ఏఎస్.రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 14వ తేదీన పదో తరగతి నూతన సిలబస్‌పై ఉపాధ్యాయులకు అవగాహన తరగతులు...

విజయవాడ, న్యూస్‌లైన్ : డాక్టర్ ఏఎస్.రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  14వ తేదీన పదో తరగతి నూతన సిలబస్‌పై ఉపాధ్యాయులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ ఏఎస్.రామకృష్ణ  తెలిపారు.

స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడలోని మాంటిస్సోరి మహిళా కళాశాల ఆవరణంలో 14వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు అవగాహన తరగతులు జరుగుతాయన్నారు.  నూతన సిలబస్ రూపకల్పనలో సమన్వయకర్తగా  వ్యవహరించిన ఎస్‌సీఈఆర్‌టీకి చెందిన ప్రొఫెసర్ ఎన్. ఉపేందర్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు.
 
ఆయనతోపాటు పదోతరగతి నూతన పాఠ్యపుస్తకాల రచయితలు, విద్యావేత్తలు పాల్గొని ఉపాధ్యాయులకు సిలబస్‌పై అవగాహన కల్పిస్తారన్నారు. ముఖ్యంగా గణితం, ఫిజికల్ సైన్స్, జీవశాస్త్రం, ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అవగాహన తరగతులకు జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, ప్రైవేటు ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
 

Advertisement

పోల్

Advertisement