హెచ్‌ఐవీ పిల్లల హాస్టల్‌ ప్రారంభం

HIV Children School And Hostel Start In Dhoolipalla - Sakshi

సాక్షి, సత్తెనపల్లి(గుంటూరు) : ప్రజలకు అవినీతి రహిత పరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. హౌస్‌ ఆఫ్‌ ఆనియన్స్‌ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్‌ ఫాదర్‌ వైఎల్‌ మర్రెడ్డి ఆధ్వర్యంలో ధూళిపాళ్ళ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్‌ఐవీ పిల్లల పాఠశాల, వసతి గృహాన్ని గురువారం ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే అంబటి మాట్లాడుతూ ప్రజలకు  మంచి పరిపాలన అందించాలనే దృక్పథంతో సీఎం వైఎస్‌ జగన్‌ పని చేస్తున్నారన్నారు.

ఫాదర్‌ మర్రెడ్డి ఎంతో సేవా దృక్పథంతో ఎంతో కష్టానికి ఓర్చి నిదులు సమకూర్చి పాఠశాల, హాస్టల్‌ నిర్మించి విద్యార్థులకు సేవ చేయాలనే ప్రయత్నం అభినందనీయమన్నారు. సంస్థ డైరెక్టర్‌ ఫాదర్‌ వైఎల్‌ మర్రెడ్డి మాట్లాడుతూ ధూళిపాళ్ళ ప్రాంతంలో ఎక్కువ మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారని, హైవే పక్కన ఉన్న గ్రామాలను ఎంపిక చేసుకొని ఈ పాఠశాల, హాస్టల్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అనంతరం అమెరికా ప్రతినిధులు చారెల్, డేవిడ్‌ను సత్కరించారు. కార్యక్రమంలో పేరేచర్ల కు చెందిన ఫాదర్‌ బాలస్వామి, స్థానిక పెద్దలు, నాయకులు తదితరులు ఉన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top