అరుదైన దేవాలయం.. ఆదరణేదీ?

Historic Temple Has No Development In West Godavari - Sakshi

అన్నవరప్పాడులో పరశురాముడి ఆలయం

దేశంలోనే రెండో దేవాలయంగా ప్రసిద్ధి

సాక్షి, పెరవలి (పశ్చిమ గోదావరి): మండలంలోని అన్నవరప్పాడులో పరశురాముడి ఆలయం దేశంలోనే అరుదైనది. ఇలాంటి ఆలయం కోల్‌కతలో ఒకటి, ఆ తర్వాత మళ్లీ అన్నవరప్పాడులోనే ఉంది. ఈ ఆలయం 13వ శతాబ్దంలో వెలిసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడ పరశురాముడు పాలరాతి విగ్రహంలో ఉండగా, విగ్రహం చూస్తే మాత్రం బుద్ధుడు స్ఫురించడం విశేషం. పెద్దపెద్ద చెవులతో ఈ విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంలో  వివాహాలు చేసుకున్నవారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, పిల్లాపాపలతో జీవిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో ప్రత్యేక ఉత్సవం అంటూ లేకున్నా ఏటా శ్రీరామనవమికి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈ ఆలయాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఆ దిశగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వం స్పందించాలి
మా తాత ముత్తాతల నుంచి ఆలయంలో అర్చకులుగా సేవలు అందిస్తున్నాం. ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధిచెందింది. అయితే ప్రభుత్వ ఆదరణ లేక అభివృద్ధి చెందలేదు. ఇటువంటి అరుదైన దేవాలయాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది. 
–వెలవలపల్లి విశ్వనాథం, అర్చకులు, అన్నవరప్పాడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top