అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం చేసే భూ సేకరణను అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, సేకరణ క్రమంలో నష్టపోయామనుకునే బాధితులు కోర్టు ను ఆశ్రయించవచ్చని పేర్కొంది.
సాక్షి, హైదరాబాద్: అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మా ణం కోసం చేసే భూ సేకరణను అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, సేకరణ క్ర మంలో నష్టపోయామనుకునే బాధితులు కోర్టు ను ఆశ్రయించవచ్చని పేర్కొంది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా రణస్థలి మండలంలో నిర్మిస్తున్న అణు విద్యుత్ ప్లాంట్ కోసం భూ సేకరణ చేపట్టకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దా ఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. నిర్మాణం జరిగే ప్లాం ట్లకు చట్ట ప్రకారం అన్ని అనుమతులూ పొందాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం, అణు విద్యుత్ ప్లాం ట్ ప్రాజెక్ట్ డెరైక్టర్‌ను ఆదేశించింది.
నిర్మాణంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిం ది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అణు విద్యుత్ ప్లాంట్‌కు ఆటమిక్ రెగ్యులేటరీ బోర్డు నుంచి అనుమతులూ తీసుకోలేదని, బాధితుల పునరావాసం గురించి పట్టిం చుకోలేదని, అందువల్ల భూ సేకరణ ప్రక్రియ చేపట్టకుండా ఆదేశించాలని కోరుతూ కెప్టెన్ జె. రామారావు ఈ పిల్‌ను దాఖలు చేశారు. అయితే, దీనిని ఇప్పటికే ఓసారి విచారించిన ధర్మాసనం, సోమవారం మరోసారి విచారించి పైవిధంగా తీర్పు చెబుతూ వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది.