హిందూయేతరుల పేరుతో ఉద్యోగులను తొలగిస్తారా?

High court comments about TTD - Sakshi

టీటీడీని నిలదీసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: హిందూయేతరుల పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానాలతోపాటు, ఆ దేవస్థానాల ఆర్థిక సాయంతో నడిచే దేవాలయాలు, ఆసుపత్రులు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించేందుకు వీలుగా షోకాజ్‌లు జారీ చేయడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇన్నేళ్లు సేవలు అందించిన వారిని ఇప్పుడు ఏదో ఓ కారణంతో ఉద్యోగాల నుంచి తీసేసి వారి కడుపు కొట్టడం ఎంతవరకు భావ్యమంటూ టీటీడీ ఈవోను ప్రశ్నించింది.  ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్‌లో హిందూయేతరులకు ఉద్యోగం లేదన్న విషయాన్ని పేర్కొనని అప్పటి టీటీడీ ఈవో, ఇతర ఉద్యోగులపై ముందు చర్యలు తీసుకుని, ఆ తరువాత పిటిషనర్ల గురించి ఆలోచన చేయాలంది.

పిటిషనర్ల తొలగింపు విషయంలో వచ్చేవారం వరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదని  ఆదేశించింది. వచ్చే ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top