ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిగలను ఉపయోగించుకుని మోసం చేశారని, ఇపుడు వరంగల్‌కు అపరిచితులను తీసుకువచ్చి...
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిగలను ఉపయోగించుకుని మోసం చేశారని, ఇపుడు వరంగల్‌కు అపరిచితులను తీసుకువచ్చి ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలపై దాడులు చేయించారని టీఆర్‌ఎస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘టీడీపీ పారిపోయే పార్టీ, చంద్రబాబు యాత్రను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని అన్నారు.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎంఆర్‌పీఎస్ ముసుగులో టీఆర్‌ఎస్ దాడులు చేసిందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సీఎంలు ఎలాగో తమకు ఏపీ సీఎం కూడా అంతేనని, తమ ప్రభుత్వం బాబు యాత్రకు కావాల్సినంత భద్రత కల్పించిందని పేర్కొన్నారు. వరంగల్‌లో జరిగిన సంఘటనలకు చంద్రబాబు, ఎర్రబెల్లి దయాకర్‌రావులే బాధ్యత వహించాలని అన్నారు.