విజయనగరం సమీపంలోని గొట్లాం వద్ద రైలు ప్రమాద వివరాలు తెలిపేందుకు విశాఖ రైల్వేస్టేషన్‌లో ఎమర్జెన్సీ కౌంటర్ ఏర్పాటు చేశారు.
విశాఖపట్నం: విజయనగరం సమీపంలోని గొట్లాం వద్ద రైలు ప్రమాద వివరాలు తెలిపేందుకు విశాఖ రైల్వేస్టేషన్‌లో ఎమర్జెన్సీ కౌంటర్ ఏర్పాటు చేశారు. అయిదు హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. హెల్ప్ లైన్ సెంటర్ల ఫోన్ నంబర్లు: 0891 2843003, 004, 005, 006
ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయింది, ఎంతమంది గాయపడింది ఇంకా స్సష్టంగా తెలియలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశం చిమ్మచీకటిగా ఉన్నందున సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టంగా ఉంది. రైల్వే అధికారులు చనిపోయినవారి వివరాలను సేకరిస్తున్నారు.