భాగాల్లో తీవ్రంగా వాపు కనిపించింది. రక్తపోటుకు అధికంగా మందులు వాడటంతో కిడ్నీలపై ప్రభా వం చూపాయని, శస్త్ర చికిత్సకు సిద్ధం కావామండలంలోని పార్లపల్లికి చెందిన తాళ్ల రమణయ్య ఏడేళ్లుగా కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నా డు. ఆయన వ్యవసాయ కూలీ. కాళ్లు, పొట్ట పరిసర లని వైద్యులు సూచించారు
	
	 విడవలూరు, న్యూస్‌లైన్: భాగాల్లో తీవ్రంగా వాపు కనిపించింది. రక్తపోటుకు అధికంగా మందులు వాడటంతో కిడ్నీలపై ప్రభా వం చూపాయని, శస్త్ర చికిత్సకు సిద్ధం కావామండలంలోని పార్లపల్లికి చెందిన తాళ్ల రమణయ్య ఏడేళ్లుగా కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నా డు. ఆయన వ్యవసాయ కూలీ. కాళ్లు, పొట్ట పరిసర లని వైద్యులు సూచించారు. కుమా ర్తె వివాహానికి సిద్ధంగా ఉంచుకున్న నగలను అమ్మడంతో పాటు, దాచుకున్న న గదు కలిపి సుమారు రూ.4 లక్షల వరకు చెన్నై ఆస్పత్రిలో ఖర్చు చేసినట్టు బాధితుడు తెలిపాడు. జబ్బు నయం కాకపో గా పొట్ట ఉబ్బడం, కాళ్లు తీవ్రంగా వాచి పోవడంతో నడిచేందుకు అతని శరీరం సహకరించలేదు. దీంతో అతను ఏడాదిగా మంచానికే పరిమితమయ్యాడు. చెన్నైలో ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షలాది రూ పాయిలు ఖర్చు చేసినా ఫలితం లేదని, కిడ్నీ మార్చాలని వైద్యులు చెబుతున్నారని రమణయ్య తెలిపారు.
	 
	 ముందుకొచ్చిన తల్లి
	 వృద్ధులైన తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండాల్సిన రమణయ్య అనారోగ్యానికి గురి కావడంతో తల్లి బుజ్జమ్మ మనసు చలించిపోయింది. కొడుకు రమణయ్యకు ఒక కిడ్నీ ఇచ్చేందుకు ఆమె ముందుకు వచ్చింది.
	 
	 కిడ్నీకి తోడు కాలేయ జబ్బు
	 ఖర్చులు భరించలేక చెన్నై నుంచి నెల్లూరుకు వచ్చి ఒక వైద్యశాలలో చికిత్స పొందుతున్న రమణయ్యకు కిడ్నీ మార్చే సమయం దగ్గర పడింది. ఇందుకు అవసరమైన నగదును కూడా సమకూర్చుకున్న సమయంలో అతనికి మరో పిడుగులాంటి వార్త నిలువునా కూల్చేసింది. రమణయ్య శస్త్రచికిత్సకు ఒక్కరోజు ఉందనగా శరీరంలో వస్తున్న మార్పులను గమనించిన వైద్యులు కాలేయాన్ని పరీక్షించారు. రమణయ్య కాలేయం కూడా పూర్తిగా దెబ్బతినడంతో వైద్యులు చేతులెత్తేశారు.
	 మహానేత వైఎస్సార్ పుణ్యాన ఆరోగ్యశ్రీ కింద అతను వైద్యం పొంది కాలేయ జబ్బు నుంచి బయటపడ్డాడు.
	 
	 మహానేత దయతో బతుకుతున్నా: రమణయ్య
	 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దయతో ఇంకా బతుకుతున్నా. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నా. ప్రస్తుతం కాలేయ జబ్బు నయం అయింది. కిడ్నీని మార్చేందుకు రూ.7 లక్షలు అవసరం. రాయవేలూరులోని వైద్యశాలలో కిడ్నీకి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు దాతలు మానవతా దృక్పథంతో సాయం అందించాలని కోరుతున్నా. సాయం చేయదలచిన దాతలు 9951895311, 9866605397లో సంప్రదించాలి. నెల్లూరు బృందావనంలోని కార్పొరేషన్ బ్యాంక్‌లో (అకౌంట్ నెంబర్ 919291) నగదు వేయవచ్చు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
