కార్తీకమాసం సందర్భం ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు.
హైదరాబాద్: కార్తీకమాసం సందర్భం ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మల్లన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్తీకమాసం పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి.