
విజయనగరంలో భారీ వర్షం
విజయనగరంలో బుధవారం భారీ వర‍్షం కురుస్తోంది.
విజయనగరం: జిల్లా కేంద్రంలో భారీ వర‍్షం కురుస్తోంది. ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వాన పడుతోంది. దీంతో ఒక్కసారిగా విజయనగరం రహదారులు జలమయమయ్యాయి. అకాల వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.