మదనపల్లె పట్టణం జనసంద్రమైంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జగన్ ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
మదనపల్లె, న్యూస్‌లైన్: మదనపల్లె పట్టణం జనసంద్రమైంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జగన్ ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ‘సమైక్య శంఖారావం’ పూరించడానికి ఇక్కడికి వచ్చిన ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మదనపల్లె రూరల్ వలసపల్లెలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ గ్రామ నాయకులు దండాల రవి ఆధ్వర్యంలో మహిళలు మంగళ హారతులు, పూలమాలలతో జగన్‌ను ముంచెత్తారు. రాష్ర్టం సమైక్యంగా ఉండాలని స్థానిక బసినికొండ ప్రాంతంలోని దర్గాలో జగన్ ప్రార్థనలు చేశారు. మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రెహ్మాన్, అనంతపురం జిల్లా మైనారిటీ సెల్ కన్వీనర్ కేఎస్‌ఎస్‌బీ.నూర్‌బాబా, దర్గా మతగురువు కేఎస్‌ఎస్.బాబా అ బ్దుల్లా, మోహన్‌తాజ్ శాలువతో సన్మానించారు. చిత్తూరు బస్టాండు సర్కిల్‌లో ని వాల్మీకి విగ్రహానికి జగన్ పూలమాలలు వేశారు.
ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభ విజ యవంతమైంది. పార్టీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఏవీ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, షమీం అస్లాం, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉదయ్‌కుమార్, మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్తర్‌అహ్మద్, మైనారిటీ నాయకులు బాబ్‌జాన్, పీఎస్.ఖాన్, నాయకులు జింకా వెంకటాచలపతి, సురేంద్ర, ఎస్‌ఏ.కరీముల్లా, రెడ్డివారి సాయిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.