Sakshi News home page

నడకతోనే ఆరోగ్యం

Published Wed, Feb 12 2014 11:31 PM

నడకతోనే ఆరోగ్యం

నడకతోనే ఆరోగ్యం
 నేటి ఉరుకులు పరుగుల జీవనంలో మనిషి ఆరోగ్యం భిన్న సమస్యలకు గురవుతోంది. బీపీలు, షుగర్ వ్యాధి బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. దీంతో ఆరోగ్యవంతమైన సమాజం రానురాను కనుమరుగైపోతుందేమోననే  భయాందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అనారోగ్యం బారిన పడినవారు కొందరు ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు మరికొందరు.. ముందస్తు జాగ్రత్తలో ఇంకొందరు.. కారణాలు ఏమైనా.. పట్టణ వాసులు జీవనయానంలో ‘నడక’ను తప్పనిసరి చేసుకుంటున్నారు.

దీనిలో భాగంగా ఉదయమో, సాయంత్రమో గంట నుంచి రెండు గంటల పాటు నడుస్తూ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పట్టణంలోని డీఏఆర్ కళాశాలలో గతంలో ఉదయం వాకర్లు పెద్దగా కనిపించేవారు కాదు. అయితే కొన్ని నెలలుగా రానురాను వాకింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉదయం పూట కళాశాల గ్రౌండ్‌లో 150 నుంచి 2 వందల మంది వరకు వాకింగ్ చేస్తున్నారు. మైలవరం రోడ్డు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, ముసునూరు రోడ్లతోపాటు జంక్షన్ రోడ్డు, విజయవాడ రోడ్డులలో వందలాది మంది నడుస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు ఇప్పటికే చాలామంది ఉదయాన్నే నడకబాట పట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నా రు. ఈ నేపథ్యంలో వాకర్స్ అభిప్రాయాలు..
 
 రోజంతా ఉత్సాహమే
 ఉదయం ఒక గంటసేపు వాకింగ్ చేస్తే రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అలసట అనేది లేకుండా పని చేయగలుగుతున్నాను. అందరం కలసి అరగంట సేపు జోక్‌లు వేసుకుం టూ హాయిగా నవ్వుకుంటాం. కొత్త మిత్రులు  పరిచయమవుతున్నారు. విజ్ఞా నం పెరుగుతోంది. 5 సంవత్సరాలుగా వాకింగ్ చేస్తున్నా.               

  - శ్యామ్
 
 యాంత్రిక జీవనంలో అవసరం
 యాంత్రికంగా మారిన ప్రస్తుత జీవన విధానంలో నడక ఎంతో అవసరంగా మారింది. రోజురోజుకు బీపీ, చక్కెర వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. శ్రమ అవసరాన్ని ఇప్పుడిప్పుడే గుర్తించి అవగాహన పెంచుకుంటున్నారు. రెండు సంవత్సరాల నుంచి వాకింగ్ చేస్తున్నా.
 - రమేష్
 
 20 ఏళ్లుగా వాకింగ్ చేస్తున్నా
 రోజులో రెండుగంటల పాటు చేస్తున్న వాకింగ్‌తో ఒత్తిడి లేకుండా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతోంది. వాకింగ్ చేసిన తరువాత అ
 - నౌడు నాగమల్లేశ్వరరావు
అరగంట సేపు వ్యాయామం కూడా చేస్తాను. దాదాపు 20 ఏళ్లుగా వాకింగ్ చేస్తున్నాను. వాకింగ్‌కు రానిరోజు ఏదో వెలితిగా ఉంటుంది.
 - రత్తయ్య
 
 వాకింగ్ ఎంతో అవసరం  
 పట్టణాలలో ఒకరికొకరు సంబంధం లేకుండా జీవిస్తున్న నేపథ్యంలో వాకింగ్ కోసం గ్రౌండ్‌కు రావడం వల్ల ఆరోగ్యానికి హాయిగా ఉంటోంది. కొత్తకొత్త పరిచయాలు పెరుగుతున్నాయి. అలాగే రోగాలతో బాధపడేవారే సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో శ్రమ అనేది ఎంతో అవసరం.
 - నౌడు నాగమల్లేశ్వరరావు

 
 
 

Advertisement
Advertisement