పోర్టుజాడ.. నీలినీడ | he construction of the port of Bandar saw the eclipse | Sakshi
Sakshi News home page

పోర్టుజాడ.. నీలినీడ

Jan 18 2016 1:38 AM | Updated on Sep 3 2017 3:48 PM

పోర్టుజాడ..  నీలినీడ

పోర్టుజాడ.. నీలినీడ

బందరు పోర్టు నిర్మాణానికి పట్టిన గ్రహణం వీడడం లేదు. 2008లో పైలాన్ వేసినప్పటి నుంచి ఇప్పటివరకు బాలారిష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.

బందరు పోర్టు నిర్మాణానికి పట్టిన గ్రహణం వీడడం లేదు. 2008లో పైలాన్ వేసినప్పటి నుంచి ఇప్పటివరకు బాలారిష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తొలుత స్థల సేకరణ, ఆ తర్వాత పోర్టు అనుబంధ పరిశ్రమల పేరిట 30 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో వారు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ ఆయా
 గ్రామాలకు వెళ్లినప్పుడు అడ్డుకుంటున్నారు.

ఇదే సమయంలో నాగాయలంక మండలంలోని గుల్లలమోద వద్ద క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంతో పోర్టు నిర్మాణానికి లంగరు పడినట్లయింది. ఇది మచిలీపట్నంలో పోర్టు నిర్మించే ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో భద్రతాపరమైన  ఆంక్షలు విధిస్తారేమోనన్న నీలినీడలు కమ్ముకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement