అనారోగ్యంతో అప్పులపాలైన ఓ చేనేత కార్మికుడు ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
చేనేత కార్మికుడు ఆత్మహత్య..
Jun 16 2017 8:09 PM | Updated on Nov 6 2018 8:08 PM
మదనపల్లె: అనారోగ్యంతో అప్పులపాలైన ఓ చేనేత కార్మికుడు ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(39) కూలి మగ్గాలు నేసుకుంటూ భార్య, ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్యానికి గురి కావడంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స చేయించుకున్నా ఫలితం కనిపించలేదు.
మెరుగైన వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక, మగ్గం నేయలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో రూ.లక్షకు పైగా అప్పులు చేశాడు. భార్య కూలి పని చేస్తే కానీ ఇల్లు గడవని దుస్తితి నెలకొంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన సుబ్రమణ్యం భార్య, పిల్లలు నిద్రించిన సమయంలో ఇంటిపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Advertisement


