చేనేత కార్మికురాలి ఆత్మహత్య | Handloom weaver commits suicide | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికురాలి ఆత్మహత్య

Jan 16 2016 7:59 PM | Updated on Nov 6 2018 7:56 PM

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన చేనేత కార్మికురాలు యర్రజోడు గోవిందమ్మ(37) అప్పులబాధతో శనివారం ఆత్మహత్య చేసుకుంది.

ధర్మవరం అర్బన్ : అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన చేనేత కార్మికురాలు యర్రజోడు గోవిందమ్మ(37) అప్పులబాధతో శనివారం ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలు కలిసి మగ్గాలు నేస్తుండేవారు. గోవిందమ్మకు అనారోగ్యంతో పాటు కుటుంబ పోషణ కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశారు. వాటిని తీర్చలేమన్న బెంగతో ఆమె రోజూ మనోవేదనకు గురయ్యేది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పు దూలానికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఇది గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement