'ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేదు' | gudiwada amarnath fires on chandra babu naidu | Sakshi
Sakshi News home page

'ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేదు'

Apr 20 2015 11:42 AM | Updated on Jul 28 2018 6:48 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి ఓటమి భయం పట్టుకుందని అందుకే ఎన్నికలకు వెళ్లటం లేదని వైఎస్సార్సీపీ విశాఖపట్టణం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి ఓటమి భయం పట్టుకుందని అందుకే విశాఖ  గ్రేటర్ ఎన్నికలకు వెళ్లటం లేదని వైఎస్సార్సీపీ విశాఖపట్టణం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీని  క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని గుడివాడ అమర్నాథ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement