గ్రానైట్‌ పరిశ్రమకు ఊరట | Granite industry calls for reduction in18per cent GST | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ పరిశ్రమకు ఊరట

Oct 7 2017 12:19 PM | Updated on Oct 7 2017 12:19 PM

ఒంగోలు సెంట్రల్‌: వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన శుక్రవారం న్యూ ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్‌ 22వ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో గ్రానైట్‌ పరిశ్రమపై విధించిన 28 శాతం పన్నును 18 శాతానికి  తగ్గించారు. ఇది జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమల నిర్వాహకులకు కొంత ఊరటనిచ్చింది. ఏసీ రెస్టారెంట్లపై
18శాతనికి బదులుగా 12 శాతం పన్ను వసూలు చేస్తారు. గ్యాస్‌ స్టవ్‌లు, వినియోగదారులు వస్తువులను 28 శాతం పన్ను పరిధి నుంచి తొలగించాలని నిర్ణయించిన్నట్లు సమాచారం. వస్త్రాలపై ఉన్న 12 శాతాన్ని 5 శాతానికి తగ్గించారు.

స్కూలు స్టేషనరీ, రబ్బర్‌ బ్యాండ్స్, మామిడి పండ్ల రసం, పాపడాలు తదితర వస్తువలను 12 శాతం నుంచి 5 శాతం స్లాబ్‌కు మార్చారు. అంగన్‌వాడీలకు సరఫరా అవుతున్న ఆహార పదార్ధాల ప్యాకెట్లపై 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. చిన్న వ్యాపారులకు ట్యాక్స్‌ ఫైలింగ్‌ విధానాన్ని సులభతరం చేయాలని కౌన్సిల్‌ ఏకాభిప్రాయానికి వచ్చింది. ప్రతి నెలా రిటర్నులు ఫైల్‌ చేయాల్సిన విధానాన్ని మూడు నెలలక ఒక సారిగా మార్పు చేయాలని కూడా చర్చించిన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement