శతశాతం.. చరిత్రాత్మకం!

Grama Volunteer Distributed Rice Bags To Houses IN Srikakulam - Sakshi

రాష్ట్ర చరిత్రలోనే ఇది అపూర్వ ఘట్టం. రేషన్‌ కార్డుపై నాణ్యమైన బియ్యాన్ని అందించడమే ఓ ఘనత అనుకుంటే.. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సరుకు చేర్చడం మరో గొప్ప విషయం. వృద్ధులు, దివ్యాంగులు, అటవీ ప్రాంతంలో కొండలు, గుట్టలపై నివసించే గిరిజనుల ఆనందానికి అవధులు లేవు. 8.32 లక్షల ఇళ్లకు బియ్యం పంపిణీ చేసే బృహత్కార్యాన్ని కేవలం రెండు రోజుల్లో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి, సిబ్బంది అంకిత భావానికి నిదర్శనం. గ్రామ/వార్డు వలంటీర్ల సహకారంతో జిల్లా యంత్రాంగం ఈ చారిత్రక ఘట్టాన్ని పూర్తి చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాన్ని నిజం చేసింది. 

సాక్షి, శ్రీకాకుళం : పేదలకు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని అందించాలనేది ప్రజా ముఖ్యమంత్రి ఆకాంక్ష. దుర్వినియోగానికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ముంగిటకే సరుకు పంపిణీ చేయాలని తలపెట్టారు. ఇందుకు గ్రామ/వార్డు వలంటీర్ల సేవలను వినియోగించుకున్నారు. చిత్తశుద్ధి ఉండాలే గానీ సాధించలేనిది ఏముంది? కేవలం రెండు రోజుల్లో ఈ మహా క్రతువును పూర్తి చేశారు. జిల్లాలో నాణ్యమైన బియ్యం పంపిణీ శతశాతం పూర్తయింది. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి బియ్యం ప్యాకెట్లు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఈనెల నుంచి పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించగా.. శనివారమే బియ్యం పంపిణీ 92 శాతం పూర్తి చేశారు. మిగతా కార్యక్రమాన్ని ఆదివారం ముగించారు. తెల్ల రేషన్‌ కార్డు గల 8.32 లక్షల కుటుంబాలకు నాణ్యమైన బియాన్ని పంపిణీ చేసి శభాష్‌ అనిపించుకున్నారు. స్వయంగా ఇంటికే డెలివరీ చేయడం, నాణ్యమైన బియ్యం కావడంతో లబ్ధిదారులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. వర్షంలో తడిసిన కారణంగా కొన్ని చోట్ల 30 వరకు బియ్యం బస్తాలు పాడవడంతో వారికి మంచి సరుకును సరఫరా 

నాణ్యమైన బియ్యంతో వంట చేశా..
మాది హడ్కో కాలనీ. తెలుపు కార్డు ద్వారా 20 కేజీల బియ్యం ప్యాకెట్‌ ఇచ్చారు. బియ్యం నాణ్యత చాలా బాగుంది. వీటినే వంట చేశా.. అన్నం బాగుంది. ఇంటందరం ఆనందంగా తిన్నాం. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు.
– మరువాడ సుధారాణి, హడ్కోకాలనీ, నరసన్నపేట  

అసూయతోనే టీడీపీ నేతల ఆరోపణ
జగనన్న పథకాలను చూసి టీడీపీ నేతలు అసూయపడుతున్నారు. మాకు నాణ్యమైన బియ్యం వచ్చాయి. మా దగ్గరకి వచ్చి అడిగితే మేమే సమాధానం చెబుతాం. జగనన్న పాలనను చూసి టీడీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి.
– బంటు కళావతి, లబ్ధిదారు, 
.
పకడ్బందీ ప్రణాళిక
నాణ్యమైన బియ్యాన్ని ఇంటింటికీ పంపిణీ చేయడానికి గాను 6,146 వాహనాలను ఏర్పాటు చేశారు. అయితే అవసరం ఎక్కువగా ఉండడంతో కొన్నిచోట్ల ఈ వాహనాలను పెంచారు. జిల్లాలో 8.32 లక్షల కుటుంబాలకుగాను 2015 ఎఫ్‌పి షాపులు ఉన్నాయి. వీటిలో ప్రతి 50 కుటుంబాలను ఒక క్లస్టరుగా విడదీసి,  మొత్తం  15,212 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. వీటికీ గాను ఒకొక్క క్లస్టరుకు ఒక వాలంటీరును ఈ పంపిణీకి కేటాయించారు. దీంతో వారంతా రెండు రోజులపాటు సజావుగా ఈ నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేశారు. గత నెలలో బియ్యం అందిన ప్రతి కార్డుదారునికి ఈ నెలలో కూడా బియ్యాన్ని అందజేశారు. ఈకేవైసీ, ఆధార్‌ వంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకొన్నారు. ముందుగానే కార్డుదారులకు, వలంటీరుకు మ్యాపింగ్‌ చేసిన ప్రకారం ఈ బియ్యాన్ని సరఫరా చేశారు. కొన్ని చోట్ల వాలంటీర్లు లేని వలన అక్కడ వీఆర్వోల తో ఈ పంపిణీ చేసి, లబ్ధిదారులకు ఇంటింటికీ సరుకు సరఫరా చేశారు. రెండో రోజు ఆది వారం కూడా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూంను కొనసాగించారు. 

తడిసిన బియ్యం స్థానంలో మంచి సరుకు సరఫరా
తొలి రోజు పంపిణీలో తడిసిన బియ్యం వచ్చాయని కొన్నిచోట్ల ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఆ  ఫిర్యాదులపై కలెక్టర్‌ జె.నివాస్, జేసీ కె.శ్రీనివాసులు వెంటనే స్పందించి, తడిసిన బియ్యం స్థానంలో అందరికీ కొత్తగా వేరే నాణ్యమైన బియ్యాన్ని అందజేశారు. ఇటీవల వారం రోజులుగా వర్షాలు కురవడం వలన లోడింగ్, రవాణా ఇతర ప్రాం తాల్లో ఇబ్బందుల వలన ఇలా జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా కొంతమంది కావాలనే దుష్పచారంకోసం ఈ బియ్యం బాగులేవని చేస్తున్నట్టు కూడా విమర్శలు వస్తున్నాయి. టీడీపీ సానుకూల డీలర్లు ఉన్నచోట ఇటువంటి తప్పుడు ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. ఎక్కడైనా బియ్యంలో నాణ్యత కొరవడితే సరుకు మార్పు చేశారు. ఇటువంటి మార్పులు జిల్లాలో  30 బ్యాగుల వరకు ఉన్నాయని అధికారులు చెపుతున్నారు. రెండో రోజు పంపిణీలో ఒక్క ఫిర్యాదు కూడా కంట్రోల్‌ రూంకి రాలేదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top