నష్టపోయిన రైతులను ఆదుకోవాలి | Government Negligence on Neelam Toofan Victims | Sakshi
Sakshi News home page

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Oct 28 2013 3:33 AM | Updated on Sep 2 2017 12:02 AM

భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీటీడీపీ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు.

హన్మకొండటౌన్, న్యూస్‌లైన్  : భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీటీడీపీ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన నేతృత్వంలో జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు ఆదివారం కలెక్టర్ కిషన్‌ను కలిసి వర్షాలతో  దెబ్బతిన్న పం టలు, నష్టపోయిన రైతుల పరిస్థితిని వివరించారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఇటీవల కురి సిన భారీ వర్షాలతో జిల్లాలో వేలాది ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందని తెలి పారు. చేతికి వచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. వర్షాల కారణంగా జిల్లాలో సుమారు 20 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు.
గతంలో నీలం తుఫానుతో పంటలు నష్టపోయి న రైతులకు ప్రభుత్వం ఇప్పటికీ నష్ట పరిహారం అందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్ర కేబినెట్‌లో మంత్రులుగా వ్యవహరిస్తున్న జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వర్షాలతో పంటలు కోల్పోయిన రైతుల ను ప్రభుత్వం ఆదుకోకుంటే వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారని ఆయన తెలిపారు. పంట నష్టాలను ఆదర్శ రైతులతో కాకుండా ప్రత్యేక అధికారులతో చేయిం చాలని కోరారు. వరి, మొక్కజొన్న, పసుపు పంటలకు ఎకరానికి రూ15వేలు, పత్తి, మిర్చి పంటలకు ఎకరానికి రూ 20 వేల చొప్పున నష్టపరిహారం  చెల్లించాలని ఆయన కలెక్టర్ ను కోరారు.

అలాగే రంగు మారిన ధాన్యంతోపాటు ఇతర పంటలను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా కేం ద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారి లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి, ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్క, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు దొమ్మాటి సాంబయ్య, గండ్ర సత్యనారాయణరావు, వేం నరేందర్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఈగ మల్లేషం, మోహన్‌లాల్, అనిశెట్టి మురళీ, మార్గం సారంగం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement