ఖరీఫ్ సీజన్‌లో వరి ధాన్యానికి కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.1310, గ్రేడ్-ఏకు రూ.1345గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ :
ఖరీఫ్ సీజన్‌లో వరి ధాన్యానికి కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.1310, గ్రేడ్-ఏకు రూ.1345గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రభుత్వ సంస్థలతో 592 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ప్రాథమిక గిరిజన పరపతి సంఘాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చే స్తున్నారు. నిర్ధారించిన కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్ల అనంతరం ఆ ధాన్యాన్ని సంబంధిత రైస్‌మిల్లులకు కస్టమ్‌మిల్లింగ్ చే సి అప్పగించేందుకు జిల్లాలో మిల్లులను గుర్తించారు. జిల్లాలో 257 బాయిల్డ్ రైస్‌మిల్లులు, 51 రా రైస్‌మిల్లులను కస్టమ్ మిల్లింగ్ కోసం గుర్తించినట్లు ఇన్‌చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు.
ప్రతి రైస్‌మిల్లరు తనకు జారీ చేయబడిన ఆకుపచ్చ రంగు కలిగిన రిలీజ్ ఆర్డర్, అందులో కేటాయించిన కొనుగోలు కేంద్రం నుంచి మాత్రమే సూచించిన పరిణామంలో వరిధాన్యం తీసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రైస్‌మిల్లుల వారీగా కేటాయించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు, అనుమతించిబడిన ధాన్యం పరిణామం తదతర వివరాలు కరీంనగర్ జిల్లా వెబ్‌సైట్ ఠీఠీఠీ.జ్చుటజీఝ్చజ్చట.జీఛి.జీలో చూసుకోవాలన్నారు. రెండు సంవత్సరాల్లోని సీజన్లలో వరి ధాన్యం తీసుకొని కస్టమ్ మిల్లింగ్ చేయని రైస్‌మిల్లర్లకు, ప్రజా పంపిణీ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నారనే అభియోగాలపై కేసు నమోదయిన మిల్లర్లకు ఈ సీజన్‌కు కస్టమ్ మిల్లింగ్ ధాన్యం నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు.