కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు.
ఫీజుల దోపిడీ నివారణలో సర్కారు విఫలం
Published Sat, Aug 10 2013 4:38 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
హైదరాబాద్, న్యూస్‌లైన్: కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాకపోతే గనక వేలాది మంది విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో కలిసి రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. శుక్రవారం బీసీ భవన్‌లో జరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం (గ్రేటర్ హైదరాబాద్) సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫీజుల నియంత్రణ సమస్యపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కిరణ్ ప్రకటించినా నేటి కీ అది అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చేవర కూ విద్యార్థులు ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement