చుక్కల మందుకు చక్కని స్పందన | good response to pulse polio | Sakshi
Sakshi News home page

చుక్కల మందుకు చక్కని స్పందన

Jan 20 2014 3:24 AM | Updated on Sep 19 2019 2:50 PM

జిల్లాలో పల్స్ పోలి యో కార్యక్రమం విజయవంతమైంది. ఒక్క రోజే 95 శాతం మందికి పోలియో చుక్కలు వేశారు.

విశాఖపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో పల్స్ పోలి యో కార్యక్రమం విజయవంతమైంది. ఒక్క రోజే 95 శాతం మందికి పోలియో చుక్కలు వేశారు. విశాఖ ఎంవీపీ కాలనీ, అనకాపల్లిల్లో  మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎన్‌ఏడీ వద్ద మంత్రి బాలరాజు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. వైద్య ఆరోగ్య శాఖ అదనపు డెరైక్టర్ డాక్టర్ గీతా ప్రసాదిని విశాఖ అర్బన్‌లో పలు శిబిరాలను సందర్శించారు. గ్రామీణ ప్రాంతంలోని దేవరాపల్లి, చోడవరం, మాడుగుల, లంకవానిపాలెం తదితర ప్రాంతాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్యామల పర్యటించి కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు.
 
  గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండు రోజులు, విశాఖ అర్బన్‌లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని డీ ఎంహెచ్‌వో తెలిపారు. ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయాల్సిందిగా పారామెడికల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో రైల్వే శాఖ ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరానికి స్పందన లభించింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement