తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఈ నెల 27న మరోసారి సమావేశం కానుంది.
తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఈ నెల 27న మరోసారి సమావేశం కానుంది. తెలంగాణ బిల్లుతో పాటు నివేదికను ఖరారు చేయనుంది. అనంతరం మంత్రుల బృందం కేంద్ర కేబినెట్కు నివేదిక సమర్పించనుంది. దీన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపనున్నారు.
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సారథ్యంలోని జీవోఎం రాష్ట్ర విభజన వల్ల తలెత్తే పరిణామాలను చర్చించింది. ఆదాయ, ఆస్తుల పంపిణీ గురించి వివిధ పార్టీల నాయకులతో మాట్లాడారు. తెలంగాణ, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రితో కూడా ఇటీవల చర్చించింది. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు షిండే తెలిపారు.