‘పాము’ బంధువు లాకర్‌లో బంగారం గుట్టలు | Gold in the locker | Sakshi
Sakshi News home page

‘పాము’ బంధువు లాకర్‌లో బంగారం గుట్టలు

Jun 28 2017 2:02 AM | Updated on Sep 5 2017 2:36 PM

‘పాము’ బంధువు లాకర్‌లో బంగారం గుట్టలు

‘పాము’ బంధువు లాకర్‌లో బంగారం గుట్టలు

రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ప్రజారోగ్య విభాగం ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ పాము పాండురంగారావు సమీప బంధువుకు చెందిన బ్యాంకు లాకర్‌ను తెరవగా 1,400 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి.

1,400 గ్రాములు స్వాధీనం
 
జంగారెడ్డిగూడెం (పశ్చిమగోదావరి): రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ప్రజారోగ్య విభాగం ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ పాము పాండురంగారావు సమీప బంధువుకు చెందిన బ్యాంకు లాకర్‌ను తెరవగా 1,400 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. పాండురంగారావుకు సమీప బంధువు, చిన్నపిల్లల వైద్యుడైన కృష్ణ మూర్తి భార్య ఎన్‌.రాజ్యలక్ష్మి పేరున జంగారెడ్డిగూడెంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో లాకర్‌ ఉన్నట్లు గుర్తించామన్నారు.

మంగళవారం లాకర్‌ను తెరిచి చూడగా 1,400 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 23న కృష్ణమూర్తి ఇళ్లు, ఆస్పత్రిపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement