సరదాగా విహారయాత్రకు బయల్దేరిన గీతం ఇంజినీరింగ్ విద్యార్థులకు.. విషాదం మిగిలింది. పదిమంది విద్యార్థులు బైక్లపై..
విశాఖ : సరదాగా విహారయాత్రకు బయల్దేరిన గీతం ఇంజినీరింగ్ విద్యార్థులకు.. విషాదం మిగిలింది. పదిమంది విద్యార్థులు బైక్లపై.. విశాఖ జిల్లా లంబసింగికి వెళుతుండగా గురువారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఓ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి గాయపడ్డాడు.
మాకవరపుపాలెం అవంతి కళాశాల వద్ద జీపు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి సాయిచరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థి చైతన్య కుమార్ తీవ్రం గాయపడ్డాడు. మృతి చెందిన విద్యార్థి ముంబైవాసి కాగా, గాయపడిన విద్యార్థి హైదరాబాద్ వాసి. చైతన్య కుమార్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.