breaking news
Chaitanya Kumar
-
చిత్తూరు జిల్లాలో 110 ఏనుగులు!
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లాలో 90 నుంచి 110 వరకు ఏనుగులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని డీఎఫ్‌వో చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఏనుగుల గణన ప్రక్రియ శనివారంతో ముసిగింది. సర్వే వివరాలను డీఎఫ్‌వో సోమవారం మీడియాకు వెల్లడించారు. జిల్లాలోని 60కి పైగా బీట్ల నందు 150 మంది సిబ్బంది, సహాయకులు కలిసి సర్వే చేశారన్నారు. ప్రత్యక్షంగా 30కి పైగా ఏనుగులను గుర్తించారని, పరోక్షంగా 110 ఏనుగుల ఉన్నట్లు నమోదు చేశారని చెప్పారు. వీటిలో 15 వరకు చిన్న ఏనుగులు ఉన్నట్లు చెప్పారు.దక్షిణ భారతదేశంలో ప్రతి ఏటా మే నెలలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒకే సమయంలో సర్వే చేస్తారన్నారు. రాష్ట్రంలో 200 వరకు ఏనుగులు ఉంటే.. ఒక్క చిత్తూరు జిల్లాలో 100కు పైగా ఉన్నాయన్నారు. ప్రాథమిక నివేదికను కేంద్ర అటవీశాఖకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువగా పలమనేరు, పుంగనూరు, కుప్పం ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ షాక్, వాహనాలు ఢీకొని ప్రతి ఏటా 10 వరకు ఏనుగులు మృత్యువాత పడుతున్నట్లు తెలిపారు. ఏనుగుల దాడిలో ఏడాదికి రూ.కోటి వరకు పంటలకు, ప్రజల ప్రాణాలకు నష్టపరిహారంగా చెల్లిస్తున్నట్లు వివరించారు. గజరాజుల దాడుల నివారణకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
దూకుడే..
స్కేటింగ్‌లో రాణిస్తున్న చైతన్య కుమార్ అనతి కాలంలోనే అంతర్జాతీయ క్రీడాకారుడిగా గుర్తింపు ఏషియన్స్ గేమ్స్ లక్ష్యంగా సాధన చేస్తున్న టెన్త్ విద్యార్థి. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని నిరూపించాడు ఓ విద్యార్థి. స్కేటింగ్‌పై మక్కువ పెంచుకోవడమే కాదు ఆ మేరకు సాధన చేసి దూసుకుపోతున్నాడు. అనతి కాలంలోనే అంతర్జాతీయ స్కేటింగ్ క్రీడాకారుడిగా నిలిచాడు. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో 26 మెడల్స్‌తోపాటు ఇతర పోటీల్లోనూ అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురి మన్ననలు అందుకున్నాడు కోలా చైతన్య కుమార్. - శేరిలింగంపల్లి భెల్ ఎంఐజీ కాలనీలో ఉండే కోలా శ్రీనివాస్ కుమారుడే కోలా చైతన్య కుమార్. మదీనగూడలోని జెనిసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్నాడు. ఆరో తరగతిలో ఉన్నప్పుడే స్కేటింగ్‌పై శ్రద్ధ కనబరిచాడు. అతని ఆసక్తిని గమనించిన తండ్రి శ్రీనివాస్ భెల్ స్కేట్ నైన్ కోచ్ విఠలా వద్ద శిక్షణ ఇప్పించారు. అక్కడ శిక్షణ పొందిన కొద్ది కాలంలోనే పలు మెడల్స్ సాధించాడు. నిత్యం ప్రాక్టీస్... ఓవైపు చదువుతూనే మరోవైపు నిత్యం భెల్ లోని రింక్‌లో సాయంత్రం వేళ స్కేటింగ్ సాధన చేసేవాడు. ఇంటర్నేషనల్ స్కేటింగ్‌లో పాల్గొనేందుకు అవసరమైన బ్యాంక్ ట్రాక్ శేరిలింగంపల్లి ప్రాంతంలో అందుబాటులో లేకపోవడంతో నగరంలోని ఇందిరాపార్కుకు ప్రతి ఆదివారం ప్రాక్టీస్ కోసం వెళ్లేవాడు. కోలా చైతన్యకుమార్ కొద్ది కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని చాంపియన్ షిప్ మెడల్ సాధించాడు. రాష్ర్ట, జాతీయ స్థాయిల్లో పలు పతకాలు అందుకున్నాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ర్ట, జాతీయ స్థాయి పోటీల్లో, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. 2011-12 కాకినాడలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడు గోల్డ్ మెడల్స్. ► ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సిల్వర్ మెడల్ ►2012-13లో వైజాగ్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయిలో 3 గోల్డ్ మెడల్స్ ► 2011-12లో ఆర్ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయిలో రెండు గోల్డ్, ఒక బ్రాంజ్ మెడల్స్ ► జాతీయ స్థాయిలో ఒక బ్రాంజ్ మెడల్ ► 2012-13లో రాష్ట్ర స్థాయిలో సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ ► 2013-14లో రాష్ట్ర స్థాయిలో మూడు గోల్డ్ మెడల్స్ ► జాతీయ స్థాయిలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ► సీబీఎస్ఈ సౌత్‌జోన్ పోటీల్లో గోల్డ్ మెడల్ ► సీబీఎస్ఈ జాతీయ పోటీల్లో గోల్డ్ మెడల్ ► 2014 ఆర్ఎస్ఎఫ్ఐ రాష్ర్ట స్థాయి పోటీల్లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించాడు ► బెల్జియంలో జరిగిన ప్లాండ ర్స్ గ్రాండ్ ఫిక్స్ షార్ట్ డిస్టెన్స్‌లో చాంపియన్ షిప్ కైవసం చేసుకున్నాడు. ప్రభుత్వ సహకారం అవసరం... శేరిలింగంపల్లి ప్రాంతంలో బ్యాంక్‌ట్రాక్ లేకపోవడంతో ఇందిరాపార్కుకు తీసుకెళ్లడం ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన పని. ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనేందుకు బ్యాంక్‌ట్రాక్ ప్రాక్టీస్ ఎంతో అవసరం. దాన్ని ఈ ప్రాంతంలో అందుబాటులోకి తేవాలి. స్కేటింగ్ క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటే మరెంతో మంది రాణిస్తారు. మా అబ్బాయి చైతన్యకు స్కేటింగ్‌లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయంగా మెడల్స్ రావడం వెనుక కోచ్ విఠలా కృషి ఎంతో ఉంది. - కోలా శ్రీనివాస్ (చైతన్యకుమార్ తండ్రి) ఏషియన్ గేమ్స్‌లో ప్రాతినిధ్యం కోసం... స్కేటింగ్‌లో ఏషియన్ గేమ్స్‌లో దేశం తరఫున పొల్గొనడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంటర్నేషనల్ గేమ్స్‌లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ తీసుకుంటున్నా. తల్లిదండ్రులు, కోచ్ విఠలా, పాఠశాల యాజమాన్యం సహకారంతో పతకాలు సాధించగలిగా. - కోలా చైతన్య కుమార్ -
గీతం విద్యార్థుల విహార యాత్రలో విషాదం..
విశాఖ : సరదాగా విహారయాత్రకు బయల్దేరిన గీతం ఇంజినీరింగ్ విద్యార్థులకు.. విషాదం మిగిలింది. పదిమంది విద్యార్థులు బైక్‌లపై.. విశాఖ జిల్లా లంబసింగికి వెళుతుండగా గురువారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఓ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి గాయపడ్డాడు. మాకవరపుపాలెం అవంతి కళాశాల వద్ద జీపు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి సాయిచరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థి చైతన్య కుమార్ తీవ్రం గాయపడ్డాడు. మృతి చెందిన విద్యార్థి ముంబైవాసి కాగా, గాయపడిన విద్యార్థి హైదరాబాద్ వాసి. చైతన్య కుమార్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్కేటింగ్‌లో మెరిసిన చైతన్య
శేరిలింగంపల్లి: ఫ్లాండర్స్ గ్రాండ్ ప్రి ఇంటర్నేషనల్ రోలర్ స్పీడ్ స్కేటింగ్‌లో నగరానికి చెందిన చైతన్య కుమార్ మెరిశాడు. బెల్జియంలోని ఆస్టెండ్‌లో ఇటీవల జరిగిన ఈ పోటీల్లో బీహెచ్ఈఎల్ స్కేటర్ చైతన్య స్వర్ణ, రజత పతకాలు గెలిచాడు. మరో భారత స్కేటర్ మిహిర్ హిందుధర్ ఈ పోటీల్లో రెండు రజతాలు, ఒక కాంస్యం చేజిక్కించుకున్నాడు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున పాల్గొన్న వీరిద్దరు పతకాలు సాధించడం పట్ల భారత కోచ్ విఠలా ఉప్పలూరి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చాంపియన్‌షిప్‌లో 22 దేశాలకు చెందిన 500 మందికి పైగా స్కేటర్లు పాల్గొన్నారని ఆయన వివరించారు. నగరానికి చెందిన మరో కుర్రాడు శశాంక్ రాయ్ 17వ స్థానంలో నిలిచాడు. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో మిహిర్ మూడో స్థానంలో నిలవగా, యూరోపియన్ చాలెంజ్ షార్ట్ డిస్టెన్స్ ఈవెంట్లో చైతన్య కుమార్ ప్రథమ స్థానం పొందాడు.