వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకే గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నుంచి బరిలోకి దిగుతున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు.
ఆత్మకూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకే గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నుంచి బరిలోకి దిగుతున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. ఆత్మకూరులోని పంచాయతీరాజ్ అతిథిగృహంలో శుక్రవారం నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ మండల కన్వీనర్లు, ముఖ్యనేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డితో గౌతమ్‌కు ఎంతో సాన్నిహిత్యం ఉందని గుర్తు చేశారు.
సొంతగడ్డపై పోటీకి గౌతం ముందుకు వచ్చారన్నారు. ఆయన్ను ఆశీర్వదించాలని ఎంపీ అభ్యర్థించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రాఘవేంద్రరెడ్డికి సముచిత స్థానం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, నాయకులు రాపూరు వెంకట సుబ్బారెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, ఇందూరు నారసింహారెడ్డి, ఐవీ కృష్ణారెడ్డి, కడివేటి సంజీవరావు, బండ్లమూడి అనిత, బాలచెన్నయ్య, బాలకొండయ్య, పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ శేషారెడ్డి, మైనార్టీ నేత ఖాజావలి, దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.