
ముందే లీకైన గ్యాస్!!
కోనసీమలోని నగరం వద్ద గెయిల్ గ్యాస్ పైప్లైను పగిలిపోవడం వల్ల గ్యాస్ ముందుగానే లీకైంది. గురువారం అర్ధ రాత్రి సమయంలో పైప్లైన్ పగలడంతో గ్యాస్ దాదాపు అరకిలోమీటరు మేర వ్యాపించింది.
కోనసీమలోని నగరం వద్ద గెయిల్ గ్యాస్ పైప్లైను పగిలిపోవడం వల్ల గ్యాస్ ముందుగానే లీకైంది. గురువారం అర్ధ రాత్రి సమయంలో పైప్లైన్ పగలడంతో గ్యాస్ దాదాపు అరకిలోమీటరు మేర వ్యాపించింది. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అక్కడున్న ఓ హోటల్లో టీ పెట్టడానికి స్టౌ వెలిగించాలని ప్రయత్నించడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దాంతో అక్కడున్న ఇద్దరు అక్కడికక్కడే కాలిపోయారు. ఆ పక్క నుంచి బైకులో వెళ్తున్న తండ్రి, కూతురు కూడా సజీవ దహనమయ్యారు. ఇళ్లలో ఉన్నవాళ్లు పడుకున్నవాళ్లు పడుకున్నట్లే కాలిపోయారు. ఆ ప్రాంతంలో దాదాపు 10 అడుగుల మేర పెద్ద గొయ్యి ఏర్పడింది.
అరకిలోమీటరు పరిధిలో అంతా బూడిద అయిపోయింది. మృతదేహాలు కనీసం గుర్తుపట్టడానికి కూడా వీల్లేనంతగా కాలిపోయాయి. అయితే.. ఇంత పెద్ద సంఘటన జరిగినా, ఓఎన్జీసీ, గెయిల్ అధికారులు మాత్రం వెంటనే స్పందించలేదు. ఈ ప్రాంతంలో ఉండే ఉన్నతాధికారులు తమ సెల్ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారంటూ స్థానికిఉలు జీసీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ఓఎన్జీసీకి సంబంధించిన ఫైరింజన్లు వెనువెంటనే వచ్చి ఉంటే ప్రమాద తీవ్రత చాలావరకు తగ్గేదని స్థానికులు అంటున్నారు.