విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో వివిధ జిల్లాలకు చెందిన 17 మంది చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు.
విజయవాడ (కృష్ణా జిల్లా) : విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో వివిధ జిల్లాలకు చెందిన 17 మంది చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. ప్రముఖ సినీనటి సమంత నేతృత్వం వహిస్తున్న ప్రత్యూష సపోర్టు ట్రస్టు సహకారంతో ఆంధ్రా హాస్పిటల్స్ మదర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చారిటీ ఆధ్వర్యంలో యూకేకు చెందిన 11మంది పిల్లల గుండె వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సలు చేసింది.
నవంబరు 29 నుంచి ప్రారంభమైన ఉచిత శస్త్రచికిత్సల శిబిరం శుక్రవారం వరకు కొనసాగింది. వీరందరికీ పుట్టుకతోనే సమస్య ఉందని వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రా హాస్పటల్స్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ పీవీ రమణమూర్తి, పీడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు, ఇంగ్లాండ్ వైద్య బృందంలోని డాక్టర్లు సంజీవ్, విక్రమ్, రమణ తదితరులు పాల్గొన్నారు.