వికలాంగులకు ఉచిత పరికరాల పంపిణీ | free bycycles to handicapeds | Sakshi
Sakshi News home page

వికలాంగులకు ఉచిత పరికరాల పంపిణీ

May 26 2015 7:24 AM | Updated on Sep 3 2017 2:44 AM

అనంతపురం జిల్లాలోని అంగవికలురకు మంగళవారం నుంచి సహాయ పరికరాలను ఉచితంగా అందజేయనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది.

అనంతపురం: అనంతపురం జిల్లాలోని అంగవికలురకు మంగళవారం నుంచి సహాయ పరికరాలను ఉచితంగా అందజేయనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. మూడు చక్రాల సైకిళ్లు, వీల్‌చైర్లు, కృత్రిమ కాళ్లు, వినికిడి యంత్రాలు తదితరాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. మంగళవారం తాడిపత్రిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, 27వ తేదీన శింగనమల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, 28న గుంతక ల్లులోని డాక్టర్ సర్వేపల్లి మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో, 29న కల్యాణదుర్గం ఎంపీడీవో కార్యాలయంలో ఈ మేరకు శిబిరాలు ఉంటాయని తెలిపింది. అర్హులందరూ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించింది.

Advertisement

పోల్

Advertisement