కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి చేతుల మీదుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)కి గురువారం శంకుస్థాపన చేశారు.
తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి చేతుల మీదుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)కి గురువారం శంకుస్థాపన చేశారు. స్థానిక విమానశ్రయ రన్ వే పై ప్రత్యేక వేదికలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబునాయుడుతోపాటూ కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
సీఎం, కేంద్రమంత్రులు ముందుగా పైలాన్ను ఆవిష్కరించి నిట్ శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.