రుణమాఫీ కాలేదని రైతుల ఆందోళన | formers protest at co-operative bank | Sakshi
Sakshi News home page

రుణమాఫీ కాలేదని రైతుల ఆందోళన

Jun 1 2015 1:47 PM | Updated on Sep 3 2017 3:03 AM

రుణమాఫీ కాలేదని తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మండల పరిధిలోని 9 గ్రామాలకు చెందిన 1200 మంది రైతులు కో-ఆపరేటివ్ బ్యాంకు ఎదుట ఆందోళకు దిగారు.

పిఠాపురం: రుణమాఫీ కాలేదని తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మండల పరిధిలోని 9 గ్రామాలకు చెందిన 1200 మంది రైతులు కో-ఆపరేటివ్ బ్యాంకు ఎదుట ఆందోళకు దిగారు. సోమవారం ఉదయం పురుగుల మందు డబ్బాలతో చేరుకుని రుణమాఫీ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఈ గ్రామాలకు చెందిన రైతులు సుమారు బ్యాంకు నుంచి రూ.6 కోట్లు రుణం తీసుకున్నారు. వీరికి ఒక్క రూపాయి కూడా మాఫీ కాకపోవడంతో ఆందోళన బాట పట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి మెలిక పెట్టకుండా పూర్తిగా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement