గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం సందిటివారిపాలెంలో బుచ్చిరెడ్డి(40) అనే రైతు రుణమాఫీ కాలేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
గుంటూరు : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం సందిటివారిపాలెంలో బుచ్చిరెడ్డి(40) అనే రైతు రుణమాఫీ కాలేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయంలో దిగుబడి రాక అప్పుల పాలైనట్లు, రుణమాఫీ కూడా కాకపోవడంతో దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రైతు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(పిడుగురాళ్ల)