అనంతపురం జిల్లాలో బుధవారం ఉదయం కలకలం రేపిన చిరుత ఎట్టకేలకు అటవీశాఖ అధికారులకు చిక్కింది.
అనంతపురం జిల్లాలో బుధవారం ఉదయం కలకలం రేపిన చిరుత ఎట్టకేలకు అటవీశాఖ అధికారులకు చిక్కింది. చిరుత బుధవారం ఉదయం 7 గంటలకు అచన్నపల్లికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి కనిపించడంతో అతడు భయాందోళనలకు గురై గ్రామంలోకి పరుగులు తీశాడు. గ్రామస్తులు కేకలు వేయడంతో చిరుత భయంతో చెట్ల పొదల్లోకి వెళ్లి దాక్కుంది. దీంతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు.
చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆ స్థలాన్ని పరిశీలించారు. చిరుత నుంచి రక్షణ కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి గురువారం ఉదయం చిరుతను పట్టుకున్నారు.