కారు బీభత్సం: ఐదుగురికి తీవ్రగాయాలు


రోడ్డు పక్కన కూర్చున్న వారిపై వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమూరు సమీపంలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన కొందరు పెడన మండలం ఉప్పలకలవగుంట గ్రామానికి వచ్చి కూలి పనులు చేసుకుంటున్నారు. వారు మంగళవారం వేమూరు వచ్చి కొండాలమ్మ గుడి వద్ద పూజలు చేశారు. అనంతరం అక్కడే రోడ్డు పక్కన బెంచిపై కూర్చుని ప్రసాదం తింటున్నారు. అదే క్రమంలో రిజర్వు పోలీస్ కానిస్టేబుల్ నారాయణరావు కారు వేగంగా వచ్చి వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు పురుషులు, ముగ్గురు స్త్రీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top