మత్స్యకారులకు 5 లక్షల ఆర్థికసాయం

Five Lakh Financial Assistance To Fishermens - Sakshi

మంత్రి మోపిదేవి వెంకటరమణ

సాక్షి, అమరావతి: మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదారత చూపారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. పాకిస్తాన్‌ చెర నుంచి విడుదలయిన 20 మంది ఆంధ్రా జాలర్లకు  ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి మోపిదేవి మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్‌ చెరలో బందీలుగా ఉన్న మత్స్యకారులను సీఎం జగన్‌ చొరవ,కృషితో విడిపించడం గర్వంగా ఉందన్నారు. 14 మాసాలుగా ఏపీకి చెందిన 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్‌ జైలులో బిక్కుబిక్కుమంటూ గడిపారని.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణాస్వీకారం చేశారన్న వార్తతో స్వస్థలం చేరుకోగలమన్న ఆత్మవిశ్వాసం వారిలో కలిగిందని తెలిపారు. సీఎం జగన్‌ ప్రసాదించిన పునర్జన్మగా వారు భావిస్తున్నారన్నారు. రాత్రి 8 గంటలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలపనున్నారని పేర్కొన్నారు. మరో ఇద్దరు మత్స్యకారులను రెండు రోజుల్లో తీసుకువస్తామని చెప్పారు. 20 మంది మత్స్యకారులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మత్స్యకారులకు సీఎం జగన్‌ ఐదు లక్షల రూపాయల చొప్పున చెక్‌లు అందజేస్తారని మంత్రి మోపిదేవి వెల్లడించారు.
(చదవండి: సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం: మత్స్యకారులు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top