ఈస్ట్ మారెడుపల్లి వద్ద బస్సులో మంటలు | firing in city bus at east marredpally | Sakshi
Sakshi News home page

ఈస్ట్ మారెడుపల్లి వద్ద బస్సులో మంటలు

Nov 1 2013 8:16 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఇంజిన్ లో లోపంతో బస్సులో మంటలు రేగిన ఘటన శుక్రవారం ఈస్ట్ మారెడుపల్లి వద్ద చోటు చేసుకుంది.

హైదరాబాద్: ఇంజిన్ లో లోపంతో బస్సులో మంటలు రేగిన ఘటన శుక్రవారం ఈస్ట్ మారెడుపల్లి వద్ద చోటు చేసుకుంది. కేపీహెచ్ బీ నుంచి ఎన్జీవో కాలనీకి వెళుతున్న సిటీ బస్సులో అకస్మికంగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమైయ్యాడు. బస్సును నిలిపివేసి ప్రయాణికులు దించేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది బస్సులో చెలరేగిన మంటలను అదుపు చేశారు. బస్సు ఇంజిన్‌లో సాంకేతిక లోపం  సంభవించడంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement