రైతును కాపాడిన అగ్నిమాపక సిబ్బంది | Sakshi
Sakshi News home page

రైతును కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

Published Sat, Nov 9 2019 1:11 PM

Fire Safety Department Saved Farmer From Well in Visakhapatnam - Sakshi

విశాఖపట్నం, రావికమతం (చోడవరం): గుమ్మాళ్లపాడు గ్రామంలో ఒక బావిలో కూరుకుపోయిన రైతును రావికమతం అగ్నిమాపక సిబ్బంది సురక్షతంగా తాళ్లతో బయటకు తీసి రక్షించారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గుమ్మాళ్లపాడు గ్రామానికి చెందిన బంటు వెంకట రమణ(50) తన పొలానికి బావిలోని నీటిని ఇంజన్‌తో తోడుకున్నాడు. అనంతరం ఇంజన్‌ పైపు బావిలో ఉండటంతో దానిని తీసేందుకు దిగి ఊబిలో చికుక్కున్నాడు. అంతకంతకూ దిగిపోతుండటంతో గట్టిగా కేకలు వేశాడు. ఆ కేకలకు సమీప రైతులు వచ్చి తాళ్లు అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు సిబ్బంది లావేటి నాగేశ్వరరావు, రమేష్, వరహాలు రైతును సురక్షితంగా బయటకు తీశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement