స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం | fire accident inspinning mill | Sakshi
Sakshi News home page

స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం

Jan 26 2015 11:05 AM | Updated on Sep 5 2018 9:45 PM

జిల్లాలోని హిందూపురం మండలం కొత్తూరు సమీపంలో సూపర్-బి స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

హిందూపురం: జిల్లాలోని హిందూపురం మండలం కొత్తూరు సమీపంలో సూపర్-బి స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో స్పిన్నింగ్ మిల్ లో నిల్వ ఉంచిన పత్తి బేళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు రూ.10 లక్షల అస్తి నష్టం వాటిల్లింది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement