
సోనో విజన్ షోరూం లో అగ్నిప్రమాదం
నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న సోనో విజన్ ఎలక్ట్రానిక్స్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది.
నెల్లూరు: నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న సోనో విజన్ ఎలక్ట్రానిక్స్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. షోరూంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ. 25 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని సమాచారం.