
చిత్తూరు డెయిరీ కోసం రాజధానిలో దీక్ష
విజయా సహకార పాల డెయిరీని తిరిగి ప్రారంభించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో జిల్లా రైతు
హైదరాబాద్: విజయా సహకార పాల డెయిరీని తిరిగి ప్రారంభించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో జిల్లా రైతు ఈదల వెంకటాచలం నాయుడు మంగళవారం నిరసన తెలియజేశారు. ఈయన ఒక్కడే నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చితూరు జిల్లాలో 10 ఏళ్ల క్రితం మూతపడిన విజయా సహకార పాల డెయిరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతులకు తగిన గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. భారతీయులు విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికితీసి రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని కోరారు.