పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంత పునారావాస కేంద్రాల్లో స్మశానానికి స్థలం కేటాయించకపోవడంతో ప్రజలు ఆందోళనకు దిగారు.
బెల్లంకొండ : పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంత పునారావాస కేంద్రాల్లో శ్మశానానికి స్థలం కేటాయించకపోవడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరు జిల్లా బెల్లంకొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... ముంపు ప్రాంత పునరావాస కేంద్రాల్లో ప్రభుత్వం శ్మశానానికి స్థలం కేటాయించకపోవడంతో ఆగ్రహానికి గురైన ప్రజలు శవంతో సహా మండల తహశీల్దార్ కార్యలయం ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. వెంటనే స్మశానానికి స్థలం కేటాంయించకపోతే ఇక్కడ నుంచి వెళ్లేది లేదని భీష్మించారు. దీనిపై చర్యలు తీసుకుంటామని వారికి సర్దిచెప్పి పంపిన తహశీల్దార్ వెంటనే ముంపు ప్రాంత పునరావాస కేంద్రాల్లో పర్యటించారు.