పోలీసులే కొట్టుకోవడం సిగ్గుచేటు: మైసూరా రెడ్డి | fight against two state police is a shame, says mysura reddy | Sakshi
Sakshi News home page

పోలీసులే కొట్టుకోవడం సిగ్గుచేటు: మైసూరా రెడ్డి

Feb 14 2015 2:54 PM | Updated on Oct 19 2018 7:19 PM

పోలీసులే కొట్టుకోవడం సిగ్గుచేటు: మైసూరా రెడ్డి - Sakshi

పోలీసులే కొట్టుకోవడం సిగ్గుచేటు: మైసూరా రెడ్డి

శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే కొట్టుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వీ. మైసూరా రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే కొట్టుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వీ. మైసూరా రెడ్డి విమర్శించారు. దీనికి ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఈ గొడవలు చూస్తుంటే తెలుగు ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుగానే మాట్లాడుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని ఆయన హితవు పలికారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ సమస్య పరిష్కారానికి గవర్నర్ వద్దకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. ఇద్దరు సీఎంలూ రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారని మైసూరా రెడ్డి దుయ్యబట్టారు. ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ సవాళ్లు, ప్రతి సవాళ్లు మానుకొని సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేయాలని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement