పండుగలా టీడీపీ సభ్యత్వ నమోదు | Festivals News Membership Registration | Sakshi
Sakshi News home page

పండుగలా టీడీపీ సభ్యత్వ నమోదు

Nov 3 2014 1:59 AM | Updated on Sep 2 2017 3:46 PM

పండుగలా టీడీపీ సభ్యత్వ నమోదు

పండుగలా టీడీపీ సభ్యత్వ నమోదు

కొరిటెపాడు(గుంటూరు): టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం నుంచి పండుగ వాతావరణంలో చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు.

కొరిటెపాడు(గుంటూరు):
 టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం నుంచి పండుగ వాతావరణంలో చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కన్వీనర్‌గా వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఎస్.ఆంజనేయులు పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగే అవకాశం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

రాష్ట్ర రాజకీయూల్లో గుంటూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కష్టపడి పనిచేస్తే పదవులు దక్కుతాయనటానికి తానే ఉదాహరణ అని గుర్తుచేశారు. ఈసారి కేవలం క్రియాశీలక సభ్యత్వం మాత్రమే ఉంటుందని వెల్లడించారు. ఓటర్లలో ఐదు శాతం మందిని క్రియాశీలక సభ్యులుగా చేర్చాలని సూచించారు. నవంబరు చివరినాటికి సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని కోరారు.

క్రియాశీలక సభ్యులకు రూ. 2 లక్షల బీమా, పాక్షికంగా గాయపడినవారికి రూ. 50 వేల సహాయం ఇస్తామన్నారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ఆర్టీసీలో పది శాతం రాయితీ కల్పిస్తామన్నారు. సభ్యులకు 15 రోజుల్లో గుర్తింపుకార్డులు ఇస్తామన్నారు. జిల్లా కన్వీనర్ జి.వి.ఎస్.ఆంజనేయులు మాట్లాడుతూ అందరి సహకారం, ప్రొత్సాహంతో పార్టీని ముందుకు నడిపిస్తానని తెలిపారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తానన్నారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి గుంటూరు జిల్లా నాంది కాబోతోందన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ గ్రూపులకతీతంగా పనిచేయాలని ఆంజనేయులుకు సూచించారు. అందరిని కలుపుకొనిపోయి పార్టీని క్షేత్రస్థాయి నుంచి ముందుకుతీసుకెళతారని ఆశిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణకుమార్, అనగాని సత్యప్రసాద్‌లు మాట్లాడుతూ తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పారు.

మాజీ మంత్రి కె.ఆర్.పుష్పరాజ్ మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీకీ లేనంతమంది కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని, సంస్థాగత ఎన్నికలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న పార్టీ టీడీపీయేనని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆంజనేయులుకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎం.జియావుద్దీన్, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, దాసరి రాజా మాస్టారు, గంజి చిరంజీవి, చిట్టాబత్తిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement