ప్రతిభాభారతి ఆరోగ్యంపై ఆందోళన

Farmer Speaker Prathibha bharathi Join With Heart Stroke In Visakhapatnam - Sakshi

ఆరిలోవ (విశాఖ తూర్పు): తండ్రి అనారోగ్యాన్ని తట్టుకోలేక మాజీ స్పీకర్‌ కె.ప్రతిభాభారతి గుండెపోటుకు గురికావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వృద్ధాప్యంతో బాధ పడుతున్న ఆమె తండ్రి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కె.పున్నయ్యను వారి స్వగ్రామమైన స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి నుంచి గురువారం అర్ధరాత్రి విశాఖ హెల్త్‌సిటీలోని పినాకిల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన అంబులెన్స్‌ వెనుక కారులో వస్తున్న ప్రతిభా భారతికి రణస్థలం సమీపంలో గుండెపోటు వచ్చింది.

దీంతో ఆమెను కూడా బంధువులు పినాకిల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇక్కడి వైద్యులు తెలిపారు.  ప్రతిభా భారతి అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందిన పలువురు నాయకులు ఆస్పత్రి వద్దకు వచ్చి ఆమె కుమార్తె గ్రీష్మ ప్రసాద్‌ను కలసి పరామర్శించారు. మాజీ మంత్రి కోండ్రు మురళి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కోళ్ల అప్పలనాయుడు, రాష్ట్ర హెచ్‌.ఆర్‌.డి. సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మేకా సత్యకిరణ్, పలువురు కార్యకర్తలు పరామర్శించిన వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top