అప్పులు తీరే దారి కానరాక ఓ రైతు బలవన్మరణం చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో గురువారం చోటుచేసుకుంది.
పుట్లూరు (అనంతపురం) : అప్పులు తీరే దారి కానరాక ఓ రైతు బలవన్మరణం చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని గరుగుచింతపల్లె గ్రామానికి చెందిన పెద్దిరాజు(55)కు రెండెకరాల భూమి ఉంది. నాలుగేళ్ల క్రితం తన చీనీ తోటలో నీటి వసతి కోసం మూడు బోర్లు వేయించాడు.
అయితే నీరు పడకపోవడంతో చీనీ చెట్లు ఎండిపోయాయి. అప్పటి నుంచి ఆ భూమి పడావుగా ఉండగా రూ.4 లక్షల అప్పు మిగిలింది. రుణం తీర్చే దారి కానరాక మనస్తాపంతో గురువారం ఇంట్లోనే పురుగు మందు తాగాడు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సాయంత్రం చనిపోయాడు.