సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు జేఏసీలు ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం విశాఖ నగరంలోనూ, జిల్లాలోనూ బంద్ సంపూర్ణంగా జరిగింది.
విశాఖపట్నం, న్యూస్‌లైన్ :
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు జేఏసీలు ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం విశాఖ నగరంలోనూ, జిల్లాలోనూ బంద్ సంపూర్ణంగా జరిగింది. జనజీవనం స్తంభించింది. వ్యాపారులు స్వచ్ఛ ందంగా బంద్ పాటించారు. రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణంతో కనిపించారుు. నిత్యం రద్దీగా జంక్షన్లన్నీ జనం లేక బోసిపోయాయి. అన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారారుు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పట్టడంతో దాదాపు 45 రోజులుగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఆటో యూనియన్లన్నీ బంద్ పాటిం చారుు. ఎక్కడికక్కడ ఆటో కార్మికులు ఆటోలను నిలుపుతూ కనిపించారు.
పలుచోట్ల సమైక్యవాదులు మానవహారాలు, రాస్తారోకో లు చేపట్టారు. వస్త్ర దుకాణాలు, హోటల్స్ మూత పడ్డారుు. మార్నింగ్, మ్యాట్నీషోలు రద్దు చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, యలమం చిలి,పాయకరావుపేట, చోడవరం, ఏజెన్సీలో ని పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో బంద్ ప్రభావం బాగా కనిపిం చింది. ఆయా చోట్ల బ్యాంకులు, పెట్రోల్ బంకులు తెరచుకోలేదు. అరకులోయలో రాకపోకలు సాగించడానికి వీల్లేకుండా రోడ్లపై చెట్లు నరికి, వాహనాలను అడ్డంగా ఉంచారు.