ఆర్టీసీ యాజమాన్యం, ఈయూ నేతల మధ్య బుధవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి
ఆర్టీసీ యాజమాన్యం, ఈయూ నేతల చర్చలు సఫలం
Sep 10 2014 5:42 PM | Updated on Sep 2 2017 1:10 PM
హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యం, ఈయూ నేతల మధ్య బుధవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. తమ డిమాండ్లకు ఆర్టీసీ యాజమాన్యం సమ్మతించడంతో సమ్మె నిర్ణయాన్ని యూనియన్ నేతలు విరమించుకున్నారు. కార్మికుల సొసైటీ, డీఏ బకాయిల చెల్లింపునకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది.
అంతేకాకుండా పండుగ అడ్వాన్స్‌లు కూడా చెల్లించేందుకు యాజమాన్యం అంగీకారం తెలిపింది. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరిస్తామని ఉద్యోగ సంఘాలకు యాజమాన్యం హామీ ఇచ్చింది.
Advertisement


