పొరపాట్లకు తావు లేకుండా పింఛన్ తనిఖీ | Error-free pension check | Sakshi
Sakshi News home page

పొరపాట్లకు తావు లేకుండా పింఛన్ తనిఖీ

Sep 23 2014 2:48 AM | Updated on Sep 2 2017 1:48 PM

పొరపాట్లకు తావు లేకుండా పింఛన్ తనిఖీ

పొరపాట్లకు తావు లేకుండా పింఛన్ తనిఖీ

వల్లూరు: సామాజిక పెన్షన్‌ల తనిఖీ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కేవీ. రమణ పేర్కొన్నారు.

వల్లూరు:
 సామాజిక పెన్షన్‌ల తనిఖీ కార్యక్రమాన్ని  ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కేవీ. రమణ పేర్కొన్నారు. వల్లూరులోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో  జరుగుతున్న సామాజిక పెన్షన్ల తనిఖీ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తనిఖీని పరిశీలించి , సభ్యులతో మాట్లాడారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి  అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఆధార్ కార్డు అను సంధానం చేసి అర్హులందరికీ  పెన్షన్ అందేలా చూడాలని చెప్పారు.వయస్సులో తేడాలకుసడలింపు ఇవ్వండి పెన్షన్ దారుల  వయస్సు ఒకటి రెండు సంవత్సరాలు తక్కువగా ఉన్నప్పటికీ అర్హులుగా ఆమోదించాలని ఈ  కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ సభ్యుడు అబ్బిరెడ్డిగారి వీరారెడ్డి కలెక్టర్‌ను కోరారు. చాలా మందికి అసలు వయస్సు 65 సంవత్సరాలు పైన ఉన్నప్పటికీ రేషన్ కార్డు, ఆధార్ కార్డులలో నమోదైన వయస్సు తేడాగా ఉండడం వలన అనర్హులుగా మారుతున్నారని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. అలాగే స్థానిక కస్తూర్బా గురుకుల విద్యాలయానికి రహదారి ఏర్పాటు చేయాలని,  పాఠశాలలో తాగునీటి వసతి కల్పించాలని జెడ్పీటీసీతో బాటు ఎంపీపీ తనయుడు శివకుమార్ రెడ్డి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  డీఆర్‌డీఏ పీడీ అనిల్ కుమార్‌రెడ్డి, తహశీల్దార్ వెంకటేష్,  ఎంపీడీవో మొగిలిచెండు సురేష్ , సర్పంచ్ శారద, ఈవోపీఆర్‌డీ రామాంజనేయులు , కమిటీ సభ్యులు నాగేశ్వరరెడ్డి, ఓబుల్‌రెడ్డి , పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement